కేటీఆర్‌ను తికమక పెడుతున్న న్యూస్ ఛానెళ్లు! - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్‌ను తికమక పెడుతున్న న్యూస్ ఛానెళ్లు!

December 18, 2017

గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఈరోజే కావడంతో సామాన్యులతో పాటు బీజీ బిజీగా ఉంటే ప్రముఖులు కూడా టీవీలకు అతుక్కుపోయారు. రిమోట్ చేతిలో పట్టుకొని ఛానళ్లు మారుస్తూ గుజరాత్ ఎన్నికలలో ఏ ఛానల్ వాళ్లు ఏం చెబుతున్నారు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గుజరాత్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో న్యూస్ చానెళ్లు కన్ఫూజ్ చేస్తున్నాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ‘ఏప్రాంతంలో ఎవరు ముందంజలో ఉన్నారో అస్సలు అర్థంకావడంలేదని, ఎందుకంటే ఒక్కో న్యూస్ ఛానెల్ ఒక్కో విధంగా నంబర్లను చూపిస్తున్నారని ఆయన అన్నారు. అయినా ఎవరి అభిప్రాయాలు వారివని నాకు తెలుసు, కానీ  నిజాన్ని, వాస్తవ విజయాన్ని ఎవరూ మార్చలేరు’ అని ఐటీమంత్రి తన ట్విటర్లో ట్వీట్ చేశారు.