ఇద్దరు ఐటీ మంత్రులూ.. ఒకే వేదికపై - MicTv.in - Telugu News
mictv telugu

ఇద్దరు ఐటీ మంత్రులూ.. ఒకే వేదికపై

November 30, 2017

తెలంగాణ ఐటీమంత్రి కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి లోకేష్  మొట్ట మొదటిసారి ఒకే వేదికను పంచుకోబోతున్నారు. ఎక్కడా అనుకుంటున్నారా ? 2018 ఫిబ్రవరిలో జరగనున్న ‘హార్వర్డ్ ఇండియా’ వేదికపైన. ‘హార్వర్డ్ ఇండియా’ 15వ వార్షికోత్సం సందర్భంగా  ఈ ఇద్దరు మంత్రులను ఆహ్వానించింది. అమెరికాలో జరిగే అతిపెద్ద ఇండియా కాన్ఫరెన్సుల్లో ‘హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్’ కూడా ఒకటి. ప్రభుత్వ అధికారులు, వాణిజ్యవేత్తలు,రాజకీయవేత్తలతో సహా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన కాన్ఫరెన్సుకు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరై  ప్రసంగించారు. అయితే వచ్చే సంవత్సరంలో జరగబోయే కాన్ఫరెన్సులో రెండు తెలుగు రాష్ట్రాల ఐటీ మంత్రులు ఎదురెదురు పడుతుండడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.