ఏపీ పాపకు కేటీఆర్ అండ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ పాపకు కేటీఆర్ అండ

April 6, 2018

విడిపోయి కలిసుందాం.. కష్టసుఖాలను మనవని పంచుకుందాం అని చెప్పకనే చెప్పారు తెలంగాణ  ఐటీశాఖ మంత్రి కేటీఆర్. కంటి సమస్యతో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక పాపకు వెంటనే వైద్యం చేయించటానికి కేటీఆర్ ముందుకు వచ్చారు. తన సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా నా ఆపన్న హస్తం వుంటుందని మంత్రి నిరూపించారు.ప్రాంతీయ బేధం లేకుండా అందరూ మనవారే అనుకున్నారు మంత్రి. హైదరాబాద్‌లోని ఎల్‌వి ప్రసాద్ లేదా సరోజినీ దేవి ఆసుపత్రుల్లో ఆ పాపకు వైద్యం చేయించడానికి సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు.  కేటీఆర్ పెద్ద మనసును సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో వేనోళ్ల పొగుడుతున్నారు.