ఓటేసిన వదినామరదళ్ళు.. కవిత, శైలిమ ఏమన్నారంటే - MicTv.in - Telugu News
mictv telugu

ఓటేసిన వదినామరదళ్ళు.. కవిత, శైలిమ ఏమన్నారంటే

December 7, 2018

మంత్రి కేటీఆర్ సతీమణి కల్వకుంట్ల శైలిమ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. హిమాయత్ నగర్‌లోని సెయింట్ ఆంతోనిస్ హైస్కూలులో ఓటు వేశారు. ‘ఓటు మనందరి హక్కు. దయచేసి మీరందరూ వచ్చి ఓటు వేయండి. బాధ్యతయుతమైన పౌరులని నిరూపించుకోండి’ అని అన్నారు.ఇదిలావుండగా ఈ ఉదయం నిజామాబాద్ పరిధిలోని పోతంగల్‌లో 177వ పోలింగ్ బూత్ వద్ద టీఆర్ఎస్ లోక్‌సభ సభ్యురాలు కల్వకుంట్ల కవిత తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు చాలా సేపు క్యూలో నిల్చున్నారు. ఓటుహక్కును ప్రతిఒక్కరు తప్పకుండా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సెలవు దొరికిందని ఇళ్లల్లో వుండక ఓటు వేయాలని అన్నారు. ఓటు వేసినవారికి ప్రశ్నించే వీలుంటుందని తెలిపారు.