ఊ.పె.కు.హ. టీజర్  ఊళ్లపైకి వచ్చేసింది! - MicTv.in - Telugu News
mictv telugu

ఊ.పె.కు.హ. టీజర్  ఊళ్లపైకి వచ్చేసింది!

February 13, 2018

సామెతల పేర్లతో సినిమా టైటిళ్లు పెట్టడం కొత్తకాదు. కాకపోతే కొన్నిసామెతలు మరీ ఎబ్బెట్టుగా ఉంటాయని సినీజనం వాటికి జోలికి పోలేదు. కానీ కాలం మారిపోతోంది.  ఊ.పె.కు.హ(ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి) పేరుతో సినిమా వచ్చేస్తోంది. ఈ మూవీ అడల్డ్ కామెడీతో సందడి చేసేందుకు వచ్చేస్తుంది. దీని టీజర్ ను తాజాగా ఊళ్లపైకి  వదిలారు.
‘ఏంటీ మీద మీద పడుతున్నావ్. నాక్కూడా చూపించూ… ఏంటీ నీకు చూపించేంది. ఆశ పడుతున్నాడు చూపించు..’ అనగానే ఆరుగురు అందమైన భామలు పోటీపడి మరి అందాలను చూపిస్తున్నారు. ఈ చిత్రంలో నట కిరీటటి  రాజేంద్రప్రసాద్, సాక్షి చౌదరి బ్రహ్మనందం, ఆలీ, ధనరాజ్  కృష్ణ భగవాన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం  జేబి క్రియేషన్స్ బ్యానర్ పై నిధి ప్రసాద్ దర్శకత్వంలో  తెరకెక్కుతోంది.

ఈ మూవీ పెద్దలకు మాత్రమే అని టీజర్‌ని బట్టి తెలుస్తోంది. మితిమీరిన ఎక్స్‌పోజింగ్, అంతకు మించిన డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో అసలు సిసలు అడల్ట్ మూవీ ఎలా ఉంటుందో టీజర్‌తోటే రుచిచూపించాడు దర్శకుడు. ‘మీ నాన్న గారు ఏం చేస్తుంటారు అంటే.. అదే చేస్తుంటారు, పాపం వీళ్లంతా పెళ్లి కోసం అలమటిస్తున్నారు, ఆడది కనిపిస్తే చాలు ఆంబోతులా నోరు తెరుచుకోవడమే ’ లాంటి డైలాగ్స్‌తో పాటు అందాల ఆరబోతతో ‘ఉ. పె. కు. హ’ థియేటర్ల‌లో వేడిపుట్టించడం ఖాయంగానే కనిపిస్తుంది.