కూకట్‌పల్లి మెట్రోవై జంక్షన్ పేరు డా. బిఆర్. అంబేద్కర్ - MicTv.in - Telugu News
mictv telugu

కూకట్‌పల్లి మెట్రోవై జంక్షన్ పేరు డా. బిఆర్. అంబేద్కర్

April 14, 2018

హైదరాబాద్‌లోని కూకట్ పల్లి వై జంక్షన్ మెట్రో రైల్వే స్టేషన్ పేరును ‘ డా. బిఆర్. అంబేద్కర్ స్టేషన్ ’ గా పేరు మార్చామని హైదరాబాద్ మెట్రో రైల్వే( హెచ్ఎమ్ఆర్) తెలిపింది. నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.గతంలో పలుమార్లు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు బాలనగర్ మెట్రో స్టేషన్ పేరును డా. బిఆర్. అంబేద్కర్‌గా మార్చాలని కోరారు. అది ఇప్పటికి కార్యరూపం దాల్చటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.