mictv telugu

ఎన్నికల సంఘానికి నందమూరి సుహాసిని ఫిర్యాదు..

December 6, 2018

తెలంగాణలో తొలి అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నిర్విరామంగా ప్రచారం చేసిన  పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నారు. మరోపక్క.. ప్రచారం ముగిసినా పార్టీ మధ్య తగవులుసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు మాత్రం తగ్గడం లేదు. హైదరాబాద్ కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు, కూకట్‌పల్లి ఏసీపీ సురేంద్రలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు వీరు సహకరిస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. తన ప్రత్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్న వీరిద్దరినీ వెంటనే బదిలీ చేయాలని కోరారు.

r

అలాగే తమ కుటుంబంలోని మహిళలను టీఆర్ఎస్ కార్యకర్తలు బెదిరిస్తున్నారని సుహాసిని ఆరోపించారు. ఓల్డ్ బోయిన్‌పల్లి, అల్లాపూర్ ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్, ప్రజాకూటమి హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉండటంతో ఉత్కంఠ నెలకొంది.