‘అజ్ఞాతవాసి’లో చేస్తున్నందుకు ఖుష్బూ ఖుషీ... - MicTv.in - Telugu News
mictv telugu

‘అజ్ఞాతవాసి’లో చేస్తున్నందుకు ఖుష్బూ ఖుషీ…

December 17, 2017

పవన్ కళ్యాణ్ ,త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ‘అజ్ఞాతవాసి’ టీజర్ శనివారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈటీజర్ ను ఒక్కరోజులోనే య్యూట్యూబ్‌లో దాదాపు 65 లక్షల మంది వీక్షించారు. అయితే  ఈ’ అజ్ఞాతవాసి‘సినిమాలో ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ కీలక పాత్రలో కనిపించబోతుంది.

 ఈరోజు కుష్బూ తన ట్విట్టర్లో ఈసినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అంతేకాదు ఇలాంటి  విలువైన పాత్ర కోసమే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను, నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ కు ధన్యవాదాలు ,పవన్ కళ్యాణ్ మంచి స్వభావం ఉన్న వ్యక్తి’ అని అని ట్వీట్ చేసింది. వచ్చేసంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి10న ఈ సినిమా విడుదల కాబోతుంది.