తెలంగాణకు 12.5 వేల కోట్ల పెట్టుబడులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణకు 12.5 వేల కోట్ల పెట్టుబడులు

October 31, 2017

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకుంటున్నాయి. తాజాగా 12500  కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది బిన్ జాయెద్ గ్రూప్

 దుబాయ్‌కు చెందిన ఈ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ గ్రూప్ రాష్ట్రంలోని రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలు, హైదరాబాదులో నిర్మించనున్న గేమ్ మరియు యానిమేషన్ టవర్, మూసీ రివర్ డెవలప్‌మెంట్ ఫ్రంట్, మిషన్ భగీరథ వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులకై పెట్టుబడులు పెడుతున్నట్టు సమాచారం. ఈ ఒప్పంద విషయమై బిస్ జాయెద్ గ్రూప్ చైర్మన్ షేక్ ఖాలేద్ బిస్ జాయెద్ అలీతో తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ దుబాయ్‌లో సమావేశమయ్యారు.

తెలంగాణ రాష్ట్రం మూడేళ్ళలో సాధించిన అభివృద్ధి గురించి వివరించారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల గురించి చర్చించి తాము కూడా తెలంగాణాలో పెట్టుబడులు పెడతామని షేక్ ఖాలేద్ బిన్ జాయెద్ అలీ ప్రకటించారు. తెలంగాణకు వచ్చిన అభివృద్ధిని చూడవలసిందిగా ఆయనను ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఆహ్వానించారు. ఈ మేరకు ఆ గ్రూపు సభ్యులు త్వరలోనే తెలంగాణకు రానున్నారని సమాచారం.