ఆ కంపెనీ పాలడబ్బాలు ప్రమాదకరం.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆ కంపెనీ పాలడబ్బాలు ప్రమాదకరం..

December 11, 2017

తమ కంపెనీ నుండి వస్తున్న పాల ఉత్పత్తులలో అతి ప్రమాదకరమైన బ్యాక్టీరియా వుందని లాక్టాలిన్ ప్రతినిధి మిచెల్ నాలేట్ ప్రకటించారు. లాక్టాలిస్‌  ​ కొన్ని వేల టన్నుల  ఉత్పత్తులను  మార్కెట్‌నుంచి ఉపసంహరించుకుంటోంది. తాము తయారు చేసిన  బేబీ పౌడర్‌లో అతిప్రమాదకరమైన బాక్టీరియా ఉందంటూ   గ్లోబల్‌ రీకాల్‌ చేపట్టింది. 

ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ అవుతున్న తమ  చిన్న పిల్లల  పాల ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన బాక్టీరియా  ‘ సాల్మొనెల్లా ’  కారణంగా  ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో  తన ఉత్పత్తులను  వెనక్కి  రప్పిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. సాల్మొనెల్లా ( జంతువుల లేదా మానవుల మలంతో  కలుషితమైన ) బాక్టీరియా కారణంగా చాలామంది పిల్లలు అస్వస్థతకు గురికావడంతో  ఫ్రాన్స్‌ ఆరోగ్య అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

సెలి , మిలుమెల్‌, పికాట్‌ వంటి  బ్రాండ్ల కింద 7 వేల టన్నుల  పాలపొడి  ఉత్పత్తులు కలుషితమయ్యాయని వెల్లడించారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న స్టాక్‌లో ఏ మేరకు దీని ప్రభావానికి గురయ్యాయి అన్నది స్పష్టం చేయలేదు.

సాల్మొనెల్లా బ్యాక్టీరియా వల్ల ఆహారం విషతుల్యంగా మారి పిల్లల్లో కడుపు తిమ్మిరి, వాంతులు, డయేరియా తదితర లక్షణాలు వ్యాపించాయి. డిసెంబర్ ప్రారంభంలో దేశంలో 26 మంది శిశువులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో సూడాన్, చైనా, బ్రిటన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల ఎగుమతులపై ప్రభావం పడనున్నది. గతంలో చైనాకు చెందిన ఓ కంపెనీ తయారు చేసిన పాల పౌడర్‌లో పారిశ్రామిక రసాయనం మెలామైన్ కలవడంతో 2008లో ఆరుగురు పిల్లలు మరణించారు. సుమారు 3 లక్షల మంది పిల్లలు సహా ఇతరులు కూడా అనారోగ్యం పాలయ్యారు.