అన్ని సర్వేలూ ఒకవైపు.. ఆంధ్రా ఆక్టోపస్ మరోవైపు.. - MicTv.in - Telugu News
mictv telugu

అన్ని సర్వేలూ ఒకవైపు.. ఆంధ్రా ఆక్టోపస్ మరోవైపు..

ఎన్నికలపై జోస్యాలు చెబుతూ ఆంధ్రా ఆక్టోపస్ టైటిల్ గెల్చుకున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ఎన్నికలపై తన సర్వే ఫలితాలంటూ గందరగోళం లెక్కలను బయటపెట్టాడు. ప్లస్ ఆర్ మైనస్ 10 అంటూ తనకు తోచిన లెక్కలు చెప్పారు. మహాకూటమి గెలుస్తుందని, టీఆర్ఎస్ ఓడిపోతుందని అంచనా వేశాడు. దేశంలోని ప్రముఖ జాతీయ మీడియా సంస్థల సర్వేలన్నీ తెలంగాణలో గెలుపు టీఆర్ఎస్‌దేనని అంచనా వేయగా, లగడపాటి ఎగ్జిట్ ఫలితాలు మాత్రం భిన్నంగా ఉండడం గందరగోళానికి తెరతీస్తోంది.

తెలంగాణ పోలింగ్ శాతం 72గా ఉంటుందనే అంచనాతో తాను ఈ ఫలితాలు వెల్లడించానని లగడపాటి మీడియాకు చెప్పాడు. ‘కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజాకూటమి 10 స్థానాలు అటూఇటుగా 65 స్థానాలతో విజయం సాధిస్తుంది. టీఆర్ఎస్ 10 స్థానాలు అటూ ఇటుగా 35 స్థానాలను మాత్రమే దక్కించుకుంటుంది. 13 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ రెండు స్థానాలు అటూఇటుగా 7 సీట్లు సాధిస్తుంది. బీజేపీకి రెండు స్థానాలు అటూఇటూగా 7 రావొచ్చు. ఎంఐఎంకు 6 లేదా 7 స్థానాలు వస్తాయి. సీపీఎం ఒక చోట గెలుస్తుంది… ’ అని తెలిపారు. తనక ఏ పార్టీపైనా పక్షపాతం లేదని అన్నాడు. తాను లోతుగా విశ్లేషించే ఈ ఫలితాలను బహిర్గతం చేస్తున్నానన్నారు.

Telugu news lagadapati Rajagopal survey predicts congress alliance win in Telangana assembly elections

MORE