mictv telugu

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ చూసి ఏడ్చేసిన లక్ష్మీ పార్వతి

February 14, 2019

దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ ఈరోజు ఉదయం విడుదలైంది. ఈ నేపథ్యంలో తెలుగు వార్త చానెల్ ‘సాక్షి’లో చర్చా కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీపార్వతి, ట్రైలర్‌ను చూసి కన్నీరు పెట్టుకున్నారు. ట్రైలర్‌పై ఎలా స్పందిస్తారని ప్రశ్నించగా, “నా కన్నీళ్లే దానికి స్పందన. చెప్పాలంటే.. ప్రతి సన్నివేశాన్నీ వాస్తవంగా తీశారు. ప్రతి సన్నివేశం… ఏదీ నేను మరిచి పోలేదు. నా జీవితంలో జరిగింది.

23 ఏళ్లు అయినా… ప్రతిక్షణం, ప్రతిమాట, ప్రతి చర్యా గుర్తుంది నాకు. అవి గుర్తున్నాయి కనుకనే నేను ఈ విధంగా నిలబడివుండగలిగాను. నిజంగా వర్మగారికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. నన్నేమీ ఆయన సంప్రదించలేదు. నన్ను ఆయన కలవలేదు. కనీసం మీరేమైనా చెబుతారా? అని నన్ను అడగలేదు” అని వ్యాఖ్యానించారు.Telugu News Lakshmi Parvati cried after watching Lakshmi s ntr movie trailer