లాల్ బహదూర్.. మీరు  గ్రేట్‌కే గ్రేట్! పెన్షన్‌తో పీఎన్ బీకి అప్పు తీర్చిన కుటుంబం - MicTv.in - Telugu News
mictv telugu

లాల్ బహదూర్.. మీరు  గ్రేట్‌కే గ్రేట్! పెన్షన్‌తో పీఎన్ బీకి అప్పు తీర్చిన కుటుంబం

February 21, 2018

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టి తుర్రుమని విదేశాలకు ఎగిరెళ్ళిన నీరవ్ మోదీ గురించి అన్వేషణ మొదలైన విషయం తెలిసిందే.  పీఎన్‌బీ స్కాం నేపథ్యంలో లాల్ బహదూర్ శాస్త్రి తనయుడు అనిల్ శాస్త్రి తన తండ్రి రుణం చెల్లింపు గురించి ప్రస్తావించారు. ‘ మేము స్కూల్లో చదువుకునేటప్పుడు టాంగాలోనే వెళ్లేవాళ్లం. సొంత పనులకు ఆఫీసు కారును అస్సలు వాడకూడదని నాన్న ఎప్పుడూ చెప్పేవారు. 1964 ప్రాంతంలో కొత్త ఫియట్ కారు కొనాలకనుకున్నాం. అప్పట్లో దాని ధర రూ. 12 వేలు. అప్పుడు నాన్నగారి బ్యాంకు ఖాతాలో ఏడు వేలే వున్నాయి. మరో ఐదువేలు నాన్నగారు పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి రుణంగా తీసుకున్నారు. 11 జనవరి 1966లో ఆయన చనిపోయారు. తర్వాత ఆ రుణాన్ని మా అమ్మగారి పెన్షన్ నుండి తిరిగి చెల్లించాం. తప్పితే ఎటూ అధికారం, పలుకుబడి చేతిలో వున్నాయని నాన్నగారు ఎప్పుడూ తల బిరుసతనంగా భావించలేదు ’ అని రవిశాస్త్రి తన గత అనుభవాన్ని పంచుకున్నారు.దేశ ప్రధానిగా ఆయన తీసుకున్న ఐదువేల రుణాన్ని ఆయన కుటుంబం చెల్లించి భావి తరాలకు ఆదర్శంగా నిలిచింది. కానీ నేడు నీరవ్ మోదీ, మాల్యాలు దేశ ద్రోహులకు ఆదర్శంగా మారారు. ఇటీవల కాలంలో బడా వ్యాపురులకు ఇదొక ట్రెండ్‌గా మారిపోయింది. సామాన్యులు లక్షో రెండు లక్షలో రుణాల కోసం తాము బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతుంటే ఇలాంటి వ్యాపారులు లాబీయింగ్ ద్వారా సంబంధిత అధికారులకు కమీషన్లు ముట్టజెప్పి తమ పని చేయించుకోవడంపై సాధారణ జనాలు గుర్రుగా ఉన్నారు.