లాలూ కొడుక్కి దయ్యాల భయం - MicTv.in - Telugu News
mictv telugu

 లాలూ కొడుక్కి దయ్యాల భయం

February 22, 2018

ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్‌ కుమారుడు తేజ్ ప్రతాప్‌ యాదవ్‌‌కు దయ్యాల భయం పట్టుకుంది. తానుంటున్న ఇంట్లోకి బిహార్ ముఖ్యమంత్రి నితీస్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీలు దయ్యాలు వదిలారంటున్నారు. ఆ దయ్యాలు తమకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న కారణంగా బంగ్లాను ఖాళీ చేస్తున్నట్టు వెల్లడించారు. గతంలో తేజ్‌ ప్రతాప్‌ ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ఆయనకు పట్నాలోని దేశ్‌రత్నా మార్గ్‌లో ఓ ప్రభుత్వ బంగ్లాను కేటాయించారు.

తేజ్ ప్రతాప్ కాంగ్రెస్, ఆర్జేడీలతో తెగతెంపులు చేసుకొని భాజాపాతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా తేజ్ ప్రతాప్‌ను అధికారులు ఆదేశించారు. గతేడాది అక్టోబర్‌లో కొందరు ఆర్జేడీ నేతలు ఈ విషయమై పాట్నా హైకోర్ట్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. గతంలో కూడా తేజ్ ప్రతాప్ ఈ తరహా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.  అప్పట్లో తనకు కేటాయించిన బంగ్లాకు వాస్తు దోషం వుందని, ప్రధాన ద్వారాన్ని మూసివేసి వెనుక ద్వారాన్ని వాడుకున్నారు.

ఇదిలా వుండగా తేజ్‌ ప్రతాప్‌ వ్యాఖ్యలపై జేడీయూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారం కోసమే అతనిలా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. తేజ్‌ ప్రతాప్‌ తనకు కేటాయించిన బంగ్లాను కేవలం కార్యకర్తల సమావేశం కోసమే వాడుతున్నారు. ప్రస్తుతం ఆయన తన తల్లి రబ్రీ దేవికి కేటాయించిన బంగ్లాలో నివసిస్తుండటం గమనార్హం.