మహిళలపై కబ్జారాయుళ్ల దాడి - MicTv.in - Telugu News
mictv telugu

మహిళలపై కబ్జారాయుళ్ల దాడి

October 26, 2017

భూకబ్జాను అడ్డుకున్న ఇద్దరు మహిళలపై దాడి చేసి, వాళ్ల చేతులు, కాళ్లు కట్టేసి  పొదల్లో పడేసారు.  విశాఖ జిల్లాలో ఈ అమానుషం జరిగింది.

వివరాల్లోక్ వెళితే అనకాపల్లికి చెందిన శేఖర్ ..భూపతిపాలెం గ్రామానికి చెందిన దేవుడు అనే రైతు భూమిని కబ్జా చేయాలనుకున్నాడు.  దీనిని అడ్డుకున్నందుకు, దేవుడు కూతుర్లపై దాడి చేసి చేతులు, కాళ్లు కట్టేసి  చెట్లల్లో పడేసారు. ‘లోకల్ లీడర్ల అండ దండలతో మాభూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని’  దేవుడి కూతుర్లు ఆరోపిస్తున్నారు. తండ్రి చనిపోయిన తర్వాత  బంజర భూమిని సాగు చేసుకుంటున్నామని, రికార్డుల్లో తమ పేర్ల నమోదు చేయాలని దేవుడు బిడ్డలు కళా వెంకటలక్ష్మి, ఆదిలక్ష్మి, మహలక్ష్మి అధికారులను డిమాండ్‌ చేశారు.

కానీ అది ప్రభుత్వ భూమి అని  దానిపై ఇరు వర్గాలు, మాదంటే మాదని కొట్లాడుతున్నారని  అధికారులు స్పష్టం చేశారు. మహిళలపై అమానుషమైన ఈ దాడులను మాత్రం సహించబోమని , దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.