‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’లో నటిస్తా: రోజా

వివాదాలు లేనిది వర్మ సినిమాలే తియ్యడు. తన ప్రతీ సినిమా వెనుక ఒక వివాదం తప్పకుండా వుంటుంది.  తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ డైరెక్ట్ చేస్తానని ప్రకటించాడు వర్మ. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ’ పేరుతో వస్తున్న ఈ సినిమా కూడా వివాదాంశంగా మారింది. ఈ సినిమాలో నటి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యే రోజాకు చాన్స్ ఉంటుందని ప్రకటించాడు వర్మ. ఈ  ఆఫర్‌పై రోజా కూడా సానుకూలంగా స్పందించారు. ‘వర్మ ఆ సినిమాలో ఏ పాత్ర  ఇచ్చినా చేస్తాను. అతను నాకు ఏ పాత్ర ఇస్తానన్నది ఇంకా చెప్పలేదు’ అని అన్నారు.  ఈ సినిమాకు వైసీపీ నేత రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ యాదృచ్ఛికం ఏంటంటే ఈ సినిమాకు రోజా, నిర్మాత వైసీపీకి చెందినవారు కాగా, లక్ష్మీ పార్వతి కూడా ఆ పార్టీ మద్దత్తదారే అవడం !  మరోపక్క.. ప్రకాశ్ రాజ్ కూడా ఈ సినిమాలో నటిస్తాడని వస్తున్న వార్తలను వర్మ ఖండించారు. ప్రకాశ్ ఈ సినిమాలో నటించట్లేదని ఫేస్ బుక్ లో తెలిపాడు. ఎన్టీఆర్ జీవితాన్ని ఆయన రెండో భార్య లక్ష్మీపార్వతి కోణం నుంచి చూపుతానని వర్మ ప్రకటించడం తెలిసిందే.

SHARE