నా అందాన్ని చూస్తున్న నాయకులు… బీజేపీ మహిళా నేత

మహిళలను లైంగికంగా వేధించడం అనే విషయం అత్యధికంగా వెలుగులోకి వచ్చింది మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారానే. అయితే ఇలాంటి వేధింపులు ఒక్క సినిమా రంగంలోనే ఎక్కువగా లేవు, అన్నీ రంగాల్లో వున్నాయని చాలా మంది గొంతెత్తి చెప్పారు. అందుకు రాజకీయాలు కూడా అతీతం కాదని ఈ ఘటన రుజువు చేస్తోంది. తాజాగా బెంగళూరు నగర పాలక సంస్థ ‘మీటూ’ వివాదంలో చిక్కుకుంది.

బీజేపీకి చెందిన ఓ మహిళా నేత, డిప్యూటీ మేయర్ ఎన్నిక, స్థాయి సంఘాల ఎంపిక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. అక్కడ తాను అందంగా వుండటంతోTelugu news Leaders looking at my beauty ... the lady leader of the BJPచాలా మంది తనను కరిచినట్టు చూశారని సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఆరోపణలు ఇప్పుడు ‘బెంగళూరు పాలికె’లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

అందంగా వుంటే మరీ ఇంత దిగజారి చూస్తారా అని ఆమె కంటతడి పెట్టుకున్నారు. ప్రతి ఏడాది తనకు స్థాయి కమిటీలో స్థానం వచ్చినట్టే వచ్చి చేయి దాటి పోతోందని, దానికి ఈ వేధింపులే కారణమని చెప్పుకొచ్చిందామె.