ముందస్తు కొసరు.. శాసన మండలి ఎన్నికల షెడ్యూల్ - MicTv.in - Telugu News
mictv telugu

ముందస్తు కొసరు.. శాసన మండలి ఎన్నికల షెడ్యూల్

September 28, 2018

శాసన మండలి ఎన్నికల షెడ్యూల్ విడులైంది. తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్లో 3 ఎమ్మెల్సీ స్థానాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీల పదవీ కాలం 2019 మార్చి 29తో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణాగుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గానికి, అలాగే తెలంగాణ రాష్ట్రంలో మెదక్నిజామాబాద్ఆదిలాబాద్కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి, వరంగల్ఖమ్మంనల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, మెదక్నిజామాబాద్ఆదిలాబాద్కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది.

Legislative council election schedule has been released

ఇందుకోసం ఓటర్ల జాబితా తయారీకి ఈసీ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అక్టోబర్ 1న ఓటర్ల జాబితా ప్రకటన విడుదల చేయనుంది. ఓటు హక్కు కోసం నవంబరు 6వరకు దరఖాస్తుకు చేసుకోవచ్చని తెలిపింది. 2019 జనవరి 1 ఓటర్ల జాబితా కూడా ఈసీ విడుదల చేయనుంది. ఆ నెలఖరు వరకు అభ్యంతాలు, వినతులు ఏమైన ఉంటే వినతులకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 20వ తేదీ వరకు 2019 ఓటర్ల తుది జాబితా ప్రటించనున్నట్లు సమాచారం.