mictv telugu

హైదరాబాద్ వర్సిటీలో పులి.. ఒంటరిగా తిరక్కండి..  

January 12, 2019

అడవుల్లో ఉండాల్సిన మృగాలు ఊళ్లలోకి వచ్చేస్తున్నాయి. తిండి కరవై జనావాసాల్లో చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ క్యాంపస్లో చిరుతపులి తిరుగుతోంది. దీంతో  విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థులు, సిబ్బంది వర్సిటీ ఆవరణలో ఒంటరిగా తిరగవద్దని అధికారులు సూచించారు.Telugu news leopard rounds in Hyderabad central University official warns don’t go single in the campusవర్సిటీ పరిధిలోని కొత్తపల్లి ప్రాంతంలో తిరుగుతున్న చిరుతపులిని మహిళా సెక్యూరిటీ గార్డు ఒకరు చూశారు. నెమలి కుంట వద్ద చిరుత పరుగులు తీసిందని మరికొందరు వెల్లడించారు. వర్సిటీ అధికారులు  తెలంగాణ అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి చేరుకుని చిరుత పాదముద్రలను గుర్తించారు. సెక్యూరిటీ సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని, చిరుత కదలికలను గుర్తించేందుకు కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేయాలని కోరారు.Telugu news leopard rounds in Hyderabad central University official warns don’t go single in the campus