ఈబతుకు చిత్రం.. నేర్పిస్తున్న పాఠాలెన్నో - MicTv.in - Telugu News
mictv telugu

ఈబతుకు చిత్రం.. నేర్పిస్తున్న పాఠాలెన్నో

November 28, 2017

కోటి విద్యలు కూటికొరకే. జానెడు పొట్టకోసం, కట్టుకునే బట్టకోసం, తలదాచుకునే  గూడుకోసం మనిషి నిరంతరం పరిస్థితులతో  యుద్దం చేస్తూనే ఉంటాడు. ఈక్రమంలో ఒక్కొక్కరిది ఒక్కోదారి.  కొందరు కష్టపడి ఏదో ఒక పనిచేసుకుంటూ జీవనాన్ని సాగిస్తుంటారు. మరికొందరు మందిని ముంచుతూ, అత్యాశతో ఎంతో కూడబెడుతుంటారు, కానీ చివరకు ఎలా వచ్చామో అలాగే వెళ్లిపోతాం అనే విషయాన్ని మరిచిపోతుంటారు.

లూనా బండిపై బతుకుబండిని లాగుతున్న  ఈదృశ్యం హైదరాబాద్  కూకట్‌పల్లి లోనిది. ఇంటింటికీ పాలను అమ్ముకుంటూ భార్యా భర్తలిద్దరూ జీవనం సాగిస్తుంటారు. భర్త చేస్తున్న వ్యాపారంలో..భర్తకు చేదోడు వాదుగా భార్యకూడా కష్టపడుతోంది. మనం మససు పెట్టి చూడాలే గానీ  మనచుట్టూ ఇలాంటి సంఘటనలు ఎన్నో, కలిసి బ్రతుకుతూ, కష్టపడుతూ బ్రతుకు పోరును సాగిస్తున్న ఈ భార్యా భర్తల ఫోటో ఎందరికో ఆదర్శం కావాలి.  

ముఖ్యంగా ఏపనీ చెయ్యకుండా  తిని కూర్చునే సోమరిపోతులూ, ఈపని చేస్తే నలుగురూ ఏమనుకుంటారో అని సిగ్గుపడే వాళ్లు, మేల్కొనవలసిన సమయమిది. మహానుభావులు చెప్పినట్టు.. ‘మీపడక మిమ్మల్ని అసహ్యించుకోక ముందే మీ బద్దకం వదలండి. అద్దం మిమ్మల్ని చూసి సిగ్గుపడకముందే  మేల్కొనండి. కొత్త నడకను నడుస్తూ, సరికొత్త దారిని వెతుకుతూ, మీ నడవడికను మార్చుకోండి. మీ గమ్యం రూపొందించుకొని కదలండి. మీచుట్టూ ఇలాంటి దృశ్యాలు వేల, లక్ష్యల సంఖ్యలో కనిపిస్తాయి. వాళ్లను ఆదర్శంగా తీసుకుని బ్రతుకుపోరులో సరికొత్త అధ్యాయాన్ని లిఖించండి.