16 లెన్స్‌ల మొబైల్ వస్తోంది… దీనితో సినిమాలు తీయొచ్చు..!

స్మార్ట్‌ఫోన్ విక్రయ కంపెనీల మధ్య విపరీతమైన పోటీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వివిధ మొబైల్ కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లతో ఫోన్లను తయారు చేయడంలో పోటీ పడుతున్నాయి. ఏదైనా మోడల్ కొత్త ఫీచర్లతో వస్తే చాలు దాన్ని క్షణాల్లో కొనేస్తున్నారు ప్రజలు. ఇప్పటికే యాప్స్, టచ్ స్క్రీన్, మెమరీ వంటి వాటిపై చాలా ప్రయోగాలు చేసిన కంపెనీలు… ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల కెమెరాలపై దృష్టి పెడుతున్నాయి. భారతీయ విపణిలోకి తిరిగి అడుగుపెట్టిన నోకియా బడ్జెట్ స్థాయి ఫోన్ల నుంచీ హైఎండ్ స్మార్ట్ ఫోన్ల వరకు చాలా మోడల్స్ విడుదల చేసింది. త్వరలో నోకియా 9 ప్యూర్ వ్యూను ఐదు రియర్ కెమెరాలతో రిలీజ్ చేయబోతోంది. ఇటీవల శాంసంగ్… నాలుగు రియర్ కెమెరాలతో గెలాక్సీ ఏ9 ను విడుదల చేసింది.Telugu News LG to launch smartphone with 16 lensesస్మార్ట్‌ఫోన్ కంపెనీలు కెమెరాల్లో సృజనాత్మకతను జోడిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని తీసుకొచ్చే ఎల్‌జీ… తాజాగా 16 లెన్స్‌లతో ఫోల్డబుల్ ఫోన్ తయారుచేస్తున్నట్లు లెట్స్‌గో డిజిటల్ అనే డచ్ వెబ్‌సైట్‌ తెలిపింది. మాట్రిక్ ఫార్మాట్‌లో లెన్స్‌ను అమర్చే ఈ ఫీచర్‌పై ఎల్‌జీ హక్కులను కొనుగోలు చేసింది. ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన అన్ని లెన్స్‌ల నుంచీ ఫొటో తీసి, అందులో నిర్ణీత లెన్స్ ద్వారా క్యాప్చర్ చేసిన ఫోటోలోని భాగాల్ని అవసరం లేదనుకుంటే డిలీట్ చేసే ఆప్షన్‌ను ప్రవేశపెడుతున్నారు. 16 లెన్స్ కావడంతో రకరకాల యాంగిల్స్‌లో ఫొటోలను ఒకే షాట్‌తో తీసుకునే వీలుంది.