శ్రీదేవి పేరుతో వంద కోట్లకు జీవిత బీమా - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి పేరుతో వంద కోట్లకు జీవిత బీమా

February 27, 2018

ఆకస్మికంగా మరణించిన శ్రీదేవి మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ప్రమాదవశాత్తు చనిపోయిందా? లేక ఎవరైనా చంపారా ? అన్న కోణంలో దుబాయ్ పోలీసులు  దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదిలా వుండగా శ్రీదేవి పేరు మీద రూ. 100 కోట్ల జీవిత బీమా వున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై బోనీకపూర్‌ను దుబాయ్ పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. బీమా డబ్బుల కోసం ఘాతుకానికి  పాల్పడ్డారా అన్న కోణంలో విచారణ కొనసాగనున్నట్టు సమాచారం.  మూడు రోజులుగా మార్చురీలో శ్రీదేవి శవం అనాథలా వుందని అక్కడి మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.  
ఆమె మరణం అసహజమన్న కోణంలో దుబాయ్ పోలీసులు ఆమె భౌతిక కాయానికి ఇవాళ మరోమారు శవ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిసింది. ఆమె తలపై లోతైన గాయాలున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఆమెను కడసారి చూడాలని, ఆమె భౌతికకాయం ఎప్పుడు ముంబైకి వస్తుందోనని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు.