మహానటిలో అర్జున్‌రెడ్డి ఇలా - MicTv.in - Telugu News
mictv telugu

మహానటిలో అర్జున్‌రెడ్డి ఇలా

April 10, 2018

‘నిజం ఎప్పుడూ అందంగానే ఉంటుంది మధురవాణి గారు ’ అంటూ మరో లుక్‌తో వచ్చింది              ‘మహానటి’ సినిమా పోస్టర్. యూత్ ఫేవరేట్ స్టార్ విజయ్ దేవరకొండ పోస్టర్ మీద స్కూటర్ మీద కెమెరా పట్టుకొని వున్న లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ జర్నలిస్టు పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు చాలా వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ఈ పోస్టర్ విడుదల అయింది.

సమంత మధురవాణి పాత్రలో మెరుస్తుండగా.. విజయ్ ఆంటోనీ పాత్రలో అలరిస్తున్నాడు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తెలుగు, తమిళంలో ఏకకాలంలో మార్చి 9న విడుదలకు సిద్ధమవుతోంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు, నాగ చైతన్య, జాగర్లమూడి రాధాకృష్ణలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.