నేటి నుంచి వ్యాలెట్ల డబ్బుపై ఆంక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

నేటి నుంచి వ్యాలెట్ల డబ్బుపై ఆంక్షలు

March 1, 2018

ఆర్‌బీఐ ఆదేశానుసారం  కేవైసీ వివరాలు ఇవ్వని యూజర్లకు పేటీఎం, మొబిక్విక్ ప్రీపెయిడ్ వ్యాలెట్లు అన్నీ సేవలకు అనుకూలించకపోవచ్చు.  ప్రతీ చెల్లింపుల సాధనం కేవైసీ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. నిన్నటితో ఆర్‌బీఐ ఇచ్చిన గడువు ముగియటంతో యూజర్లు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ప్రతీ కస్టమర్ గుర్తింపునకు సంబంధించి ఆధార్ లేదా పాన్ నంబర్  ధ్రువీకరణలను తీసుకోవాలన్నది ఆర్‌బీఐ నిబంధన.వివరాలు ఇవ్వని కస్టమర్లు కేవలం రీచార్జ్, బిల్లు చెల్లింపులు వంటి సాధారణ సేవలకు వ్యాలెట్లను వినియోగించుకోవచ్చు. వ్యాలెట్ల నుంచి బ్యాంకుకు, ఇతరులకు నగదు బదిలీలకు అవకాశం లేదు. మనీలోడ్ చేసుకునేందుకు కూడా వీలు లేదు. ఇతరులకు ఆ అవకాశాన్ని నిలిపివేసింది.

కాగా పేటీఎం ఈ రోజు కూడా క్యాష్‌లోడ్ చేసుకునేందుకు అనుమతిస్తూనే ఉంది. మొబిక్విక్ మాత్రం ఆధార్ నంబర్, పేరు వివరాలు ఇవ్వడం ద్వారా కేవైసీ పూర్తి చేస్తేనే బ్యాలెన్స్ యాడ్ చేసుకునేందుకు అనుమతిస్తోంది. పూర్తి కేవైసీ వివరాలు ఇవ్వకపోయినా రూ.10,000 వరకు లోడ్ చేసుకునేందుకు అనుమతించాలని కంపెనీలు కోరగా ఆర్‌బీఐ నో చెప్పేసింది.