అక్రమ రియల్‌పై  ఆధార్ పాదం - MicTv.in - Telugu News
mictv telugu

అక్రమ రియల్‌పై  ఆధార్ పాదం

November 21, 2017

పెద్దనోట్ల రద్దుతో సంచలనం సృష్టించిన మోదీ సర్కార్ ఇంకో కొత్త నిర్ణయానికి తెర లేపనుంది.  ఇప్పటికే బ్లాక్‌మనీని నిరోధించడానికి ఆధార్‌ లింక్‌ను ప్రతిదానికి తప్పనిసరి చేస్తూ వెళ్తోంది కేంద్ర ప్రభుత్వం. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మేటలు వేసిన  బ్లాక్‌ మనీని బయటికి తీసి,  బినామి ప్రాపర్టీలపై  ఉక్కుపాదం మోపే దిశగా మోదీ  ప్రభుత్వం ఆధార్‌ను లింకు చేయనున్నది. ఈసారి స్థిరాస్తులను టార్గెట్ చేసింది కేంద్రం.  బినామీ ప్రాపర్టీలపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పలు మార్లు ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రాపర్టీ లావాదేవీలన్నింటినీ తప్పనిసరిగా ఆధార్‌తో లింక్‌ చేసేలా నిర్ణయం తీసుకోబోతున్నారని కేంద్ర మంత్రి ఒకరు సంకేతాలు ఇచ్చారు. ఈ నిర్ణయం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల గుండెల్లో గుబులు రేపుతోంది. ప్రాపర్టీ లావాదేవీలను ఆదార్‌తో లింకు చేయడంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని కేంద్ర హౌజింగ్‌ మంత్రి హర్‌దీప్‌ పురి, ఈటీ నౌ ప్రతినిధితో చెప్పారు. ఇదెంతో ఉన్నతమైన ఆలోచన అని, తాము ముందుగానే ప్రకటన చేయడం సరికాదని సమర్థించుకున్నారు. ఇప్పటికే పాన్ కార్డులకు, బ్యాంకు అకౌంట్లకు ఆధార్ లింకును తప్పినిసరి చేసింది ప్రభుత్వం. ఆ దిశలోనే ప్రాపర్టీ మార్కెట్‌ను ఆధార్ కిందకు తేవాలనే ప్రయత్నం చేస్తున్నది.  ప్రతీదానికి ఆధార్‌ లింక్‌ తప్పనిసరి చేస్తుండటంతో పలు పిటిషన్లు కోర్టు విచారణలో ఉన్నాయి.