దేవాలయంలో మద్యం పంపిణీ, పిల్లలకు కూడా.. - MicTv.in - Telugu News
mictv telugu

దేవాలయంలో మద్యం పంపిణీ, పిల్లలకు కూడా..

January 8, 2019

మనదేశంలో మందుకు రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. పవిత్రంగా భావించే ఆలయంలో మద్యాన్ని నిస్సిగ్గుగా పంపిణీ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో హర్దోయ్‌లో ఈ సంఘటన జరిగింది. శ్రావణ దేవి ఆలయంలో సోమవారం బీజేపీ ఎమ్మెల్యే నితిన్‌ అగర్వాల్ సారథ్యంలో ‘పాసి సమ్మేళన్‌’ పేరుతో సభ పెట్టారు. తర్వాత హాజరైన పెద్దలకు పిల్లలకు లంచ్ బాక్సులు అందించారు.Telugu news liquor being distributed at temple event organised by BJP leader Naresh Agarwal in UP’s Hardoiవాటిని తెరిచిన చూసిన జనం అవాక్కయ్యారు. మందుబాబులు మాత్రం పండగ చేసుకోగా, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు కూడా మందు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. అయితే దీని వెనుక తమ ప్రమేయం లేదన బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. కొన్నాళ్ల కిందట సమాజ్‌వాది పార్టీ నుంచి బీజేపీలో చేరిన నితిన్‌ తండ్రి నరేష్‌ అగర్వాల్‌ ఆదేశాలతోనే మందు పంపిణీ చేశారని హర్దోయ్ పీ అన్షుల్ వర్మ ఆరోపించారు. సదరు లంచ్ బాక్సులను పల్లెలకు తీసుకెళ్లి జనానికి పంపిణీ చేయాలని ఎమ్మెల్యే నితిన్‌ చెబుతున్నట్లు ఉన్న వీడియో కూడా బయటికొచ్చింది.Telugu news liquor being distributed at temple event organised by BJP leader Naresh Agarwal in UP’s Hardoi