లైవ్‌లోకి దూసుకొచ్చిన కొంగ.. - MicTv.in - Telugu News
mictv telugu

లైవ్‌లోకి దూసుకొచ్చిన కొంగ..

March 2, 2018

టీవీలో ప్రత్యక్ష ప్రసారం జరగుతున్న  సమయంలో ఓ ప్రత్యేక అతిథి లైవ్‌లోకి వచ్చి షోకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  ఇంతకీ  ఆ అతిథి ఎవరో తెలుసా? ఓ  కొంగ. ఎగురుకుంటూ వచ్చిన ఆ పక్షి ఏకంగా యాంకర్ తలపైనే కూర్చుది. ఆ వీడియో వైరల్‌గా మారింది.


అమెరికాలోని శాన్‌డియాగోలోని కెఎఫ్‌ఎంబీ చానెల్‌లో యాంకర్‌ మెడినా, తన సహ యాంకర్‌ ఎరిక్‌ కహెనర్ట్‌తో కలిసి జూ  డే గురించి మాట్లాడుతోంది. అప్పుడే లైవ్‌లోకి ఐబిస్‌ జాతికి చెందిన కొంగ వచ్చి మెడినా తలపై వాలి చక్కగా కూర్చుంది. పక్కనే ఉన్న ఎరిక్ అది చూసి పడీపీడీ నవ్వాడు. తలపై పక్షి కూర్చున్నామెడినా కంగారు పడకుండా ప్రశాంతంగా నవ్వుతూ కూర్చుంది.  కొద్ది సేపటి తర్వాత ఆ పక్షి  ఎరిక్ మీద వాలబోయి వెళ్లిపోయింది.

అసలు న్యూస్‌ ప్రసారమయ్యే గదిలోకి పక్షి ఎలా వచ్చిందబ్బా అని అనుకుంటున్నారా? మరేం లేదు జూడే సందర్భంగా ఆ చానెల్‌ నిర్వాహకులు శాన్‌డియాగోలోని జంతు ప్రదర్శనశాల నుంచి ఓ ప్రత్యేక కార్యక్రమం కోసం ఆ కొంగను తీసుకొచ్చారు. యాంకర్లు పరిచయం చేసే దాకా వేచిచూడ్డం ఎందుకని సదరు కొంగ లైవ్‌లోకి వచ్చింది.