పైశాచిక పోలీసులు.. పామును మెడకు చుట్టి విచారణ.. - MicTv.in - Telugu News
mictv telugu

పైశాచిక పోలీసులు.. పామును మెడకు చుట్టి విచారణ..

February 11, 2019

లాకప్ టార్చర్ అంటే.. లాఠీ దెబ్బలు, రోకలి బండలు, కారప్పొడి, సూదులు.. వగైరా గుర్తుకొస్తాయి. ఇవన్నీ రొటీన్ అనుకున్నారేమో ఆ పోలీసులు ఏకంగా పామును ప్రయోగించారు. ఓ అనుమానితుడి మెడకు దాన్ని చుట్టేసి, విచారణ పేరుతో పైశాచికానందం పొందారు. విషయం బయటికి రావడంతో ఆ ఖాకాలపై సస్పెన్షన్ వేటు పడింది.

ఇండోనేసియాలోని పవువా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఫోన్ల చోరీ కేసులో పోలీసులు అనుమానితుణ్ని పట్టుకొచ్చి స్టేషన్ లో ఉంచారు. దొంగతనం చేశానని ఒప్పుకో అని బెదరించారు. అతడు అందుకు ఒప్పుకోలేదు. నేను చేయలేదో మొర్రో అన్నాడు. ఎన్నిసార్లు దొంగతనం చేశావని అడగ్గా, రెండుసార్లు అని అతడు చెప్పాడు. తాజా దొంగతనం కూడా నువ్వే చేశావా అని అడగ్గా లేదు అన్నాడు. దీంతో పామును అతని మెడకు చుట్టారు. దాని తోకను,  నోట్లో, బట్టల్లో కుక్కకుతాం అని భయపెట్టారు. ఈ దృశ్యాన్ని అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడతో వైరలైపోయింది. తమ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, వారిపై చర్యలు తీసుకుంటున్నామని పోలీసు విభాగం చెప్పుకొచ్చింది. వారు వాడిన పాము విషపూరితం కాదని, అదో పెంపుడు పాము అని పేర్కొంది. Telugu news live snake used to torture police suspect in Indonesia on suspect in phone theft case