బట్టలు విప్పించి, ముఖానికి బూడిద పూసి! - MicTv.in - Telugu News
mictv telugu

బట్టలు విప్పించి, ముఖానికి బూడిద పూసి!

December 18, 2017

బిహార్‌లో ఆకతాయిలకు కొందరు యువకులు తగిన బుద్ధి చెప్పారు. నలంద పట్టణంలో ముగ్గురు ఆకతాయిలు  బైక్‌పై వెళుతూ రోడ్డుపై వెళుతున్న ఓ యువతిని బూతులు తిడుతూ, లైంగికంగా వేధించారు. దీన్ని గమనించిన కొందరు యువకులు ఆ కీచకులను దొర్కబట్టి…పక్కకు తీసుకెళ్లి  చితకబాదారు.
అంతటితో ఊరుకోకుండా వాళ్ల బట్టలు విప్పించి ముఖానికి బూడిద పూసి..ఊరంతా వారిని కొట్టుకుంటూ ఊరేగించారు. వాళ్లు ప్లీజ్ అన్నా వద్దన్నా మా ఇజ్జత్ పోతదన్నా అని వారిని బతిమిలాడారు, మరి ఆడాళ్లను వేధించేటప్పుడు ఏమైందిరా ఈ బుద్ది అని ఆకతాయిలను పోలీసులకు పట్టించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అయితే ఆకతాయిలకు బూడిద పూసి బుద్ది చెప్పే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమ్మాయిని ఏడిపించిన వాళ్లకు తగిన శాస్తి జరిగిందని అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.