లోకేష్ ఒక విశ్వ విఖ్యాత పప్పు సార్వభౌముడు.. రోజా - MicTv.in - Telugu News
mictv telugu

లోకేష్ ఒక విశ్వ విఖ్యాత పప్పు సార్వభౌముడు.. రోజా

April 11, 2018

నటి, వైకాపా ఎమ్మెల్యే రోజా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌, ముఖ్యమంత్రి చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్‌కు ‘ విశ్వ విఖ్యాత పప్పు సార్వభౌమ ’ అవార్డు ఇస్తున్నానని తెలిపారు. సూటుకేసు లేకపోతే ఆయనవల్ల ఏ పనులు జరగవు అని ఎద్దేవా చేశారు. పనుల కోసం డబ్బు ఇస్తేనే ఆయన సంతకాలు పెడతారని అన్నారు.హైదరాబాద్‌లోని తమ పార్టీ కార్యాలయంలో రోజా మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలతో రాజీనామా చేసి ఎన్నికల్లోకి రావాలని అన్నారు. రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికల్లోకి దిగాలని రోజా సవాల్ విసిరారు. చంద్రబాబుగారు 29 సార్లు ఢల్లీ చుట్టూ ప్రదిక్షణలు చేయటం వెనుక ఉద్దేశం వేరే వుంది.

అసెంబ్లీ నియోజక వర్గాల పెంపు,  ఓటుకు నోటు కేసు మాఫీ కోసమే ఆయన ఈ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.యువతకు సరైన జాబులు లేక, రైతులు అప్పుల్లో మునిగిపోయారని, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు దిగులు పడ్డారు. కానీ ఆ చంద్రబాబే ఆంధ్రప్రదేశ్‌ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని, ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోందని విరుచుకుపడ్డారు.