ఆరుగురు కొడుకులున్నా..అనాథ అమ్మ - MicTv.in - Telugu News
mictv telugu

ఆరుగురు కొడుకులున్నా..అనాథ అమ్మ

October 28, 2017

ఆ అమ్మకు ఆరుగురు కొడుకులు, ఓ కూతురు. కానీ ఆ తల్లి చనిపోయిన తర్వాత ఏ ఒక్కకొడుకు, తల్లి శవాన్ని తీసుకెళ్లడానికి ముందుకు రాలేదు. బ్రతికున్నప్పుడు ఆ తల్లిని ఎలాగో పట్టించుకోలేదు, కనీసం ఆమె చనిపోయిన తర్వాత, చివరగా అంత్యక్రియలు చేయడానికి, ఏ ఒక్క కొడుకు ముందుకు రాలేదంటే..ఆలోచించండి ఈసమాజంలో ఎంత గొప్పకొడుకులున్నరో. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ధనలక్ష్మీ(75)కు ఆరుగురు కొడుకులు,ఓ కూతురు. ఈమధ్య ఆరోగ్యం సరిగా లేకపోతే, తీసుకెళ్లి దవాఖానలో పడేసారు. ఆతర్వాత అటువైపు చూడలేదు. కొడుకుల ప్రేమను తట్టుకోలేక, ఆతల్లిగుండె ఆగిపోయింది. ‘మీతల్లి చనిపోయిందని’ కబురు పంపితే వచ్చారు. కానీ తల్లిశవాన్ని నువ్వు తీసుకెళ్లు, అంటే నువ్వు తీసుకెళ్లు అని కొట్టుకున్నారు ఆ ఉత్తమ కొడుకులు. కొన్ని గంటల కొద్ది ఆతల్లిశవం ముందు కొడుకుల కొట్లాట జరుగుతూనే ఉంది.

దీంతో స్పందించిన కూతురు తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సన్నద్ధమైంది. తన కారులోకి శవాన్ని ఎక్కించింది. కొడుకులు, కోడళ్లు ఆమెతో వాగ్వాదానికి దిగారు. చుట్టు పక్కల ఉన్నవారు వచ్చి ‘కన్నతల్లిని ఇంటికి తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయడానికి మీకు ఇబ్బంది ఏంటి అని నిలదీశారు. మీతో కాకపోతే మేం తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తాం.. అంటూ పారిశుద్ధ్య కార్మికులు ముందుకువచ్చారు. దీంతో ఆ కొడుకులు హుటాహుటిన అంబులెన్స్‌ను రప్పించి తల్లిమృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇక్కడ ఇంకో విచిత్రం మేమిటంటే, కొడుకుల బుద్ది తెలిసిన ఆ తల్లి, తన అంత్యక్రియలకు అవసరపడతాయని ఓ లక్షరూపాయలు దాచుకుంది. ఈవిషయాన్ని స్వయంగా ఆ తల్లి మనుమడు మీడియాతో చెప్పాడు. నవమాసాలు మోసి, కని పెంచి, కొడుకుల భవిష్యత్తుకోసం ఎంతో కష్టపడిన ఆ తల్లి పరిస్థితి చివరికి ఇలా అయిపోయింది.