డైనోసార్లను మొదట కనిపెట్టింది బ్రహ్మే..

భూమిపై ఒకప్పుడు రాజ్యమేలి, వాతావరణం అనుకూలించిన మృత్యువాత పడిన డైనోసార్ల గురించి మనకు కొన్ని పదుల దశాబ్దాలుగానే తెలుసు. వాటి అవశేషాలపై పరిశోధనలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అయితే త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మకు వీటి విషయాలు కొట్టిన పిండి అని, ఆయన ఆ రాకాసి బల్లులపై వేదాల్లో వివరంగా రాశాడని చెప్పి ఓ జియాలజిస్టు కలకలం రేపాడు.

Telugu news Lord Brahma first to discover dinosaurs, mentioned them in Vedas Punjab university  geologist Ashu Khosla

పంజాబ్ పంజాబ్ యూనివర్సిటీకి చెందిన జియోలజిస్ట్ ఆశు కోస్లా ఈ వివరాలు వెల్లడించాడు. ‘డైనోసార్లను తొట్టతొలుత గుర్తించింది బ్రహ్మనే. కానీ అందరూ వాటిని కనిపెట్టింది బ్రిటిషర్లని, అమెరికన్లని అంటారు. అదంతా శుద్ధతప్పు. డైనోసార్లు భారత దేశంలో తామరతంపరగా ఉండేవి. వాటి పరిణామ క్రమం ఇక్కడే జరిగింది. రాజాసారస్ అనే రాకాసి బల్లి ఇండియాలోనే పుట్టింది.. అసలు డైనోసార్ అనే పదమే సంస్కృతం నుంచి వచ్చింది. డైనో అంటే  భయకంరమైనది అని అర్థం. దాన్ని డాయాన్, సార్‌గా పిల్చుకోవచ్చు. సార్ అంటే అసుర, రాక్షసులకు సంబంధించిన పదం.. బ్రహ్మ ఈ విశ్వంలో గొప్ప సైంటిస్ట్.. ఆయనకు తెలియని విషయమే లేదు ’ అని వివరించాడు. పంజాబ్‌లోని లౌలీ ప్రొఫషనల్ యూనివర్సిలో జరుగుతున్న 106వ ఇండియన్స్ సైన్స్ కాంగ్రెస్‌లో ఆయన ఈమేరకు పరిశోధనాపత్రం సమర్పిచారు. కౌరవులు టెస్ట్‌ట్యూబ్ బేబీలు అని, భారత దేశంలో వెయ్యేళ్ల కిందటే మూలకణ విధానం ఉందని ఆంధ్రా వర్సిటీ వీసీ నాగేశ్వరరావు సైన్స్ కాంగ్రెస్‌లో చేసిన ప్రకటనపై దుమారం రేగడం తెలిసిందే.

Telugu news Lord Brahma first to discover dinosaurs, mentioned them in Vedas Punjab university  geologist Ashu Khosla