భక్తకన్నప్ప భక్తి గురించి చాలా సినిమాల్లో చూశాం కదా. శివుని కళ్లలోంచి రక్తం కారుతుంటే తన కళ్లను పీకి శివునికి అర్పిస్తాడు. రెండో కన్నును పెట్టేటప్పుడు తన కాలును శివుని కన్ను దగ్గర పెట్టి,తన రెండో కన్నును శివునికి అర్పిస్తాడు.
ఆయన అపర భక్తికి శివుడు కూడా మంత్రముగ్థుడవుతాడు, అది పురాణం. కానీ ఈ కలియుగంలో కూడా ఓవింత సంఘటన జరిగింది. కర్నాటలోని బెంగుళూరు సమీపంలోని ఓ గ్రామంలో ఉన్న శివమఠంలో ఓ స్వామీజీ, శివలింగంపై కాళ్లు పెట్టి మరీ పూజలు చేశాడు. ఈఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శివభక్తులు ఆయనపై మండిపడుతున్నారు. నువ్వు దేవునికంటే గొప్పా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై శాంతిలింగేశ్వర స్వామీజీ స్పందిస్తూ తమ ఆచారాలకు అనుగుణంగానే పూజలు నిర్వహిస్తున్నామంటూ చెప్పడం విశేషం.