లవ్ హైదరాబాద్ కదులుతోంది - MicTv.in - Telugu News
mictv telugu

లవ్ హైదరాబాద్ కదులుతోంది

November 20, 2017

హైదరాబాద్ నగర వాసులను,  పర్యాటకలను విపరీతంగా ఆకర్షిస్తున్న‘లవ్ హైదరాబాద్ ’చిహ్నాన్ని ట్యాంక్ బండ్ నుంచి తొలగించారు. దానికి మరింత మెరుగులు దిద్ది , ఆనంతరం పక్కనే నెక్లెస్ రోడ్డు పక్కన ఉన్న  పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేయనున్నారు. గత ఏడాది మంత్రి కేటీఆర్ నవంబర్ 25న ఈ చిహ్నాన్ని ప్రారంభించారు. పర్యాటక రంగాన్ని  ప్రోత్సహిస్తూ ఓ స్వచ్చంద సంస్థ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం దీన్ని నెలకొల్పింది. చిహ్నంతో హుస్సేన్ సాగర్ తీరం మరింత ఆకర్షణగా నిలించింది. దీని వద్ద ఫొటోలు దిగడానికి జనం ఎగబడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో వాహనాలు నిలిపోయి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో  ఆ చిహ్నాన్ని ట్యాంక్‌బండ్  నుంచి తొలగంచి పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటుకు నగరాభివృద్ది సంస్థ ప్రయత్నాలు మెుదలు పెట్టింది.