ఈకన్నతల్లి ఆవేదన, కొడుకుకు ఎలా అర్థమవుతుంది ? - MicTv.in - Telugu News
mictv telugu

ఈకన్నతల్లి ఆవేదన, కొడుకుకు ఎలా అర్థమవుతుంది ?

November 3, 2017

అమ్మాయిలు, అబ్బాయిల బారినపడి బతుకులు బుగ్గిపాలు చేసుకోవడం షరా మామూలే, కానీ ఇక్కడ  కథ అడ్డం తిరిగింది. హైదరాబాద్ మల్కాజ్‌గిరికి చెందిన సాయి చైతన్య అనే యువకుడు, తనకంటే నాలుగు సంవత్సరాలు పెద్దదైనా సంధ్య అనే అమ్మాయి, 4 సంవత్సరాల నుండి ప్రేమించుకున్నారు. కానీ ఇద్దరి మధ్య గొడవేంటో తెలీదు, నాకు నువ్వు వద్దు అని అమ్మాయి సాయిని దూరం పెట్టింది. జీవితాంతం తనతోనే ఉంటానని వాగ్ధానం చేసిన సంధ్య, తనను మోసం చేసిందని సాయి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.

అతికష్టం మీద సాయి తల్లిదండ్రులు,సాయికి నచ్చజెప్పి కాపాడుకున్నప్పటికీ, ‘అమ్మాయి సంధ్య ఆమె తల్లిదండ్రులు తిరిగి అబ్బాయిపై తప్పుడు కేసులు పెట్టి వేధించడంతో, మానసిక ఆవేదనకు గురైనాడు. న్యాయం చేయవసిన పోలీసులు కూడా మా అబ్బాయిని పరుష పదజాలంతో వేధించడంతో మానసిక క్షోభకు గురయ్యి, ఇంట్లోంచి ఎక్కడికో వెళ్లిపోయాడు’ అని సాయి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇలా ప్రేమ పేరుతో మోసం చేసే అమ్మాయిలను  కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతుంది ఆ కన్నతల్లి. సాయి ఇంటి నుండి వెళ్లుతూ రాసిన ఉత్తరాన్ని, వీడియో కాపీని పోలీసులకు అప్పగించారు సాయి తల్లిదండ్రులు. అయినా ప్రేమించిన అమ్మాయి కాదన్నదని, పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం ఎంత వరకు కరెక్టు ? ప్రేమించిన అమ్మాయి కాదంటే, ఇక జీవితమే లేదా ? కష్టపడి పెంచి, ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులు,ఏమైపోతారు ? వాళ్ల బాధను ఎవరితో చెప్పుకుంటారు. పిచ్చి నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్క క్షణం ఇవన్నీ ఆలోచిస్తే మంచిది.