ప్రేమికుడి గొంతు కోసిన ప్రియురాలి తండ్రి ! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమికుడి గొంతు కోసిన ప్రియురాలి తండ్రి !

February 3, 2018

హిందూ, ముస్లిం భాయ్ భాయ్ అని  గొప్పగా చెప్పుకుంటున్నాం…కానీ కూతురు,  కొడుకు  వేరే మతాల వారిని ప్రేమిస్తే తమ బిడ్డను చంపుకోవడానికైనా, ప్రేమించినవాడిని  గొంతు కోయడానికైనా సిద్దపడుతున్నాం. మనదేశంలో చాలా చోట్ల జరుగుతున్నది ఇదే. ఢిల్లీలో బిడ్డ వేరే మతం అతన్ని ప్రేమించిందని అతని గొంతు కోశాడు ఓ మత పిచ్చి తండ్రి.ఢిల్లీకి చెందిన  అంకిత్ సక్సేనా (23)..  ముస్లిం అయిన షేహ్‌జాదీ(20) ఒకరినొకరు ఇష్టపడి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి మతాంతర వివాహం చేసుకోవాలని  నిర్ణయించుకున్నారు. అయితే  వీరి ప్రేమకు మతం అడ్డువచ్చింది.  యువతి తల్లిదండ్రులు.. మతంకాని వాడిని ఎలా ప్రేమిస్తావ్? అని కూతురిని బెదిరించారు.

ఈక్రమంలో పెద్దలు మన పెళ్లికి ఎలాగో ఒప్పుకోరు మనమే పెళ్లి చేసుకుని వారికి దూరంగా బతుకుదాం అని అనుకుంది ఆ ప్రేమజంట. శుక్రవారం రాత్రి  పెళ్లి గురించి  ఇద్దరు ఒకచోట కలిసి మాట్లాడుకున్నారు.  కూతురిని వెంబడించిన  ఆమె తండ్రి, ఇతర కుటుంబసభ్యులు  కత్తులతో ఆ యువకున్ని  పొడిచారు.  ప్రియురాలి తండ్రి పగతో  ఆ యువకుడి గొంతు కోశాడు. ఆ తర్వాత కూతురిని బలవంతంగా లాక్కెళ్లారు.

యువకుడి తల్లి  వారిపై  కేసు పెట్టడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  కలిసి బ్రతకాలనుకున్న  ప్రేమజంట ప్రేమ  మతం అనే మారణాయుధం  పొట్టన పెట్టన పెట్టుకుంది. యువకుడి మృతిపై   ఇరు మతాల వారి మధ్య ఇంకా ఘర్షణలు  అవుతుండడంతో  పోలీసులు ఆ ఏరియాలో  కర్ఫ్యూ విధించారు.