రెండేళ్లు ప్రేమన్నాడు..పెళ్లి పీటలపై ఒంటరిని చేశాడు - MicTv.in - Telugu News
mictv telugu

రెండేళ్లు ప్రేమన్నాడు..పెళ్లి పీటలపై ఒంటరిని చేశాడు

March 9, 2018

చాలా ప్రేమలు పెళ్లి దాకా చేరవనేది అందరికి తెలిసిందే. నిజమై ప్రేమ త్యాగాన్ని కోరుకోవాలి లేదంటే ఎంత కష్టమచ్చినా కూడా కలకాలం తోడుంటానని భరోసా ఇవ్వాలి. అంతే కానీ మధ్యలో వదిలేసి తప్పించుకుని తిరగకూడదు అది దొంగ ప్రేమే అవుతుంది. కొందరి దొంగ ప్రేమలను నిజమైన ప్రేమ అని నమ్మి నేటి యువత తమ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు.  విశాఖ పట్టణంలో కూడా ఓ దొంగ ప్రేమికుడు ఓ అమ్మాయిని రెండేళ్లు ప్రేమించాడు. నువ్వే నా సర్వస్వం..నువ్వే నా ప్రాణం అని సినిమా డైలాగులు చాలానే చెప్పాడు. తీరా పెళ్లి అనే సరికి పెళ్లి పీటలపై అమ్మాయిని ఒంటరిని చేశాడు.విశాఖపట్నం దగ్గరలోని మర్రి వలస గ్రామంలో హరితేజ అనే అమ్మాయి, శివాజీ అనే యువకుడు రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరు కులాలు వేరు..అయినా సరే నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని మాయ మాటలు బాగానే చెప్పాడు. అతనిని గుడ్డిగా నమ్మి..అతనితో పెళ్లికి ముందే కాపురం కూడా చేసింది. అయితే ఆ తర్వాత మొహం చాటేయడం మొదలు పెట్టాడు. వేరే అమ్మాయితో పెళ్లి కూడా నిశ్చయం చేసుకున్నాడు. మోసపోయానని తెలుసుకున్న హరితేజ గ్రామ పెద్దలకు చెప్పినా కూడా లాభం లేకపోయింది. దీనితో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ చేసి  అతనిని పెళ్లికి ఒప్పించారు. హరితేజనే పెళ్లి చేసుకుంటానని లిఖిత పూర్వకంగా రాసిచ్చాడు కూడా. ఆ తర్వాత ఓ గుడిలో పెళ్లి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ముహుర్తం టైం అయిపోతుంది అని పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకు ఫోన్ చేస్తే..ఇదిగో మరి కొద్ది క్షణాల్లో అక్కడుంటాను అని నమ్మించాడు. కొద్దిసేపటికి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. పెళ్లి కూతురిని పెళ్లి పీటలపై ఒంటరిని చేశాడు. మళ్లీ మోసపోయానని తెలుసుకున్న ఆమె తనకు న్యాయం చేయాలంటూ ఆ యువకుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.