mictv telugu

పోరంబోకు అడ్డాలో వాలంటైన్స్ డే.. మామూలుగా లేదుగా..

February 13, 2019

ఫిబ్రవరి 14 ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమజంటలకు పర్వదినం అది. ఆ రోజు కోసం ఏడాదంతా కళ్లు,కాళ్లు,చేతులు,ముఖం.. సమస్తం కాయలు కాచేలా ఎదురుచూస్తుంటాయి జంటలు. మనసు విప్పి మాట్లాడుకోడానికి, పవ్వులు ఇచ్చుకోడానికి సరదాగా బయటికొస్తుంటాయి. కానీ లవర్స్ డే మన సంస్కృతి కాదని కొందరు వారిపై దాడులకు దిగుతుంటారు. కనిపిస్తే పెళ్లి చేసి పారేస్తాం అని తాళిబొట్లతో వెంటపడుతుంటారు.

ఇది దేశవ్యాప్తంగా పెద్ద సమస్యయి కూర్చుంది. దీంతో లవర్స్ డే అంటే కొన్ని జంటలు భయపడి, ఇళ్లలోంచి బయటికి రావు. లవర్స్ డే నిజంగానే అంత చెడ్డదా? చెడ్డదే అయితే ప్రపంచవ్యాప్తంగా ఎందుకు జరుపుకుంటున్నారు? మరోపక్క.. పెళ్లికాకుండా ఆడామగా కలసి తిరగడం తప్పు అని భారతీయ సంస్కృతి చెబుతోంది. మనం ఎటువైపు మొగ్గాలి? ఏది సత్యం? ఏది అబద్ధం? దీనిపై మైక్ టీవీ ‘పోరంబోకు అడ్డా’ ఓ వీడియోతో ముందుకొచ్చింది. మరి అందులో ఏం చెప్పారు? ప్రేమికుల తెలుసుకోవాల్సిందేమిటి? పెళ్లి చేస్తామంటూ వారిని వెంటపడే వారి వాదన ఏంటి? తెలుసుకోవాలంటే.. ఇంకేం మరి చూసెయ్యండి..