సూరి హత్యకేసు నిందితుడు మంగలి కృష్ణ కిడ్నాప్!

అనంతపురానికి చెందిన మద్దెలచెరువు సూరి హత్య కేసులో నిందితుడైన దొంతులూరి కృష్ణ అలియాస్ మంగలి కృష్ణ ఉన్నట్టుండి వార్తల్లోకెక్కాడు. అతణ్ని ‘గుర్తు తెలియని వ్యక్తులు’ ఈ రోజు కిడ్నాప్ చేశారు. దీంతో హైదరాబాద్‌లో కలకలం రేగింది.

rr

భూవివాదానికి సంబంధించి అతనిపై ఇటీవల జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. విచారణ కోసం కృష్ణ నాంపల్లి కోర్టుకు వెళ్లాడు. కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. తర్వాత అనుచరులతో కలసి కారులో వెళ్తుండగా,  మరో వాహనంలో వచ్చిన ‘గుర్తుతెలియని వ్యక్తులు’ అడ్డుకున్నారు. వారు తమపై దాడి చేసి కృష్ణను తీసుకెళ్లాని అతని అనుచరులు పోలీసులకు చెప్పారు. అయితే కృష్ణను తీసుకెళ్లిందని టాస్క్ ఫోర్స్ పోలీసులని అతని న్యాయవాది చెప్పారు. ఓ క్రిమినల్ కేసులో విచారించడానికి అతన్ని తీసుకెళ్లి విచారించి తిరిగి వదలిపెట్టారని చెప్పారు. ఈ వ్యవహారంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Telugu news Maddela cheruvu suri murder case accused mangali Krishna kidnapped in Hyderabad by unidentified persons believed taskforce police