మాధవన్ పుత్రోత్సాహం.. స్విమ్మింగ్‌లో మెడల్ - MicTv.in - Telugu News
mictv telugu

మాధవన్ పుత్రోత్సాహం.. స్విమ్మింగ్‌లో మెడల్

April 9, 2018

నటుడు మాధవన్ సంతోషంతో ఉప్పొంగిపోతున్నాడు. అతని తనయుడు వేదాంత్ మాధవన్  అంతర్జాతీయ పోటీలో పతకాన్ని సాధించాడు. థాయ్‌లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో భారత్ తరపున పాల్గొన్న వేదాంత్  కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ సంగతిని మాధవన్ ట్విటర్ ద్వారా తెలియజేశాడు. వేదాంత్ భారత్‌కు మెడల్ తీసుకువచ్చినందుకు తనకు, తన భార్యకు చాలా సంతోషంగా ,గర్వంగా  ఉందని తెలిపాడు.

మాధవన్ సఖీ, చెలి, ఆమృత సినిమాలలో నటించి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దాదాపు 20ఏళ్ల తర్వాత చందూ మెండేటి దర్శకత్వంలో  నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ‘సవ్యసాచి’లో మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.