మాధవీలత  మౌన దీక్ష..అరెస్టు చేసిన పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

మాధవీలత  మౌన దీక్ష..అరెస్టు చేసిన పోలీసులు

April 18, 2018

నటి  మాధవీలతను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నటుడు,జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై నటి శ్రీరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు  తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మాధవీ శ్రీరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ చాంబర్ ముందు మౌన దీక్షకు దిగింది. మాధవీతో పాటు  మరికొందరు పవన్ అభిమానులు ఆమెకు మద్దతుగా దీక్షకు కూర్చున్నారు. దీంతో పిల్మ్ ఛాంబర్ ముందు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

‘పోరాటం అంటే తిట్లే కాదు… మౌనంగానూ నిరసిద్దాం”.‘.మౌనమే నా ఆయుధం’ అని రాసిన ప్లకార్డులతో ఆమె మౌన దీక్షకు దిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఫిల్మ్‌చాంబర్‌కు చేరుకున్నారు.పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు మాధవీలత సమాధానాలు కాగితంపై రాసిచూపించింది. మేము ఎటువంటి స్లోగన్స్ ఇవ్వబోమని, మౌనంగా మాత్రమే ఒంటిగంట వరకూ కూర్చుంటానని ఆమె రాసి చూపించింది. ఇదిలా ఉంటే మరోవైపు శ్రీరెడ్డి అభిమానులు అక్కడికి రావడంతో ఇరు వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువైపులా  పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.

పోలీసులు  ఎంత నచ్చజెప్పినా కూడా  మాధవీ దీక్ష విరమించుకోకపోవడంతో పోలీసులు ఆమెను బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పోలీస్ స్టేషన్‌‌లోనే మౌన దీక్ష చేస్తానని చెప్పింది.‘నా కోసం ఎవరొచ్చినా రాకపోయినా.. నేను మాత్రం స్టేషన్‌లోనే మౌనదీక్ష చేస్తానని ‘లవ్ ఇండియా’.. ‘లవ్ మై లాంగ్వేజ్’  అని తన ఫేస్‌బుక్ ఖాతాలో రాసుకొచ్చింది.