బీజేపీలోకి మాధురి దీక్షిత్.. లోక్‌సభకు పోటీ!

2019 లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ వ్యూహం మొదలుపెట్టింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయిన సందర్భంగా.. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించింది. ఎవరెవరిని బరిలోకి దించాలి, ఎవరిని పక్కన పెట్టాలి అని జాబితాలు రూపొందిస్తోంది. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీకి ఆదరణ బాగనే ఉన్నా.. కొందరు బీజేపీ ఎంపీలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసే ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ.

tt

ఈసారి జరిగే ఎన్నికల్లో పుణే లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌ను బీజేపీ నుంచి భరీలోకి దించనుంది. ఇటీవల ముంబై వెళ్లిన బీజేపీ చీప్ అమిత్ షా.. మాధురీ దీక్షిత్‌తో సమావేశమైన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే రూపొందిన జాబితాలో మాధురి పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత ఒకరు జాతీయ వార్తా ఏజెన్సీతో మాట్లాడుతూ.. ‘2019 సార్వత్రిక ఎన్నికల్లో మాధురిని ఎలాగైన బరిలోకి దించాలని పార్టీ భావిస్తుంది. ఆమెకు పూణె లోక్ సభ నియోజకవర్గం కేటాయించే అవకాశం ఉంది’ అని తెలిపారు. 2014 ఎన్నికల సమయంలో పూణెలో కాంగ్రెస్ మంచి పట్టు ఉన్నా.. బీజేపీ అభ్యర్థి అనిల్ షిరోలి ఆ స్థానం నుంచి మూడు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే సిట్టింగ్‌లను పక్కకు పెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తోంది.