మాధుర సానీ.. ఒక్కసారిగానీ ఈలవేస్తే.. - MicTv.in - Telugu News
mictv telugu

మాధుర సానీ.. ఒక్కసారిగానీ ఈలవేస్తే..

March 26, 2018

‘ఏక్ దో తీన్’ పాటతో ఒక్కసారిగా దూసుకువచ్చి ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసింది మాధురీ దీక్షిత్. ఆమె చేసిన చాలా సినిమాలు హిట్లుగానే నిలిచి అనతికాలంలోనే టాప్‌స్టార్‌ను చేశాయి. ‘గులాబ్ గ్యాంగ్’ సినిమా తర్వాత మాధురీ కొంత గ్యాప్ ఇచ్చి ఓ మరాఠీ సినిమాతో మన ముందుకు వస్తోంది.  ‘బకెట్ లిస్ట్ ’ పేరుతో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘మీ మధుర.. మధుర సానీ ’ అంటూ అందులో ఓ గృహిణిగా దర్శనమిచ్చింది. తేజాస్ ప్రభ విజయ్ డియోస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ సైరాట్ ’ చిత్రం తర్వాత మరాఠీ సినిమాల మీద బాలీవుడ్ ప్రత్యేక దృష్టిని నిలిపింది. అక్కడొస్తున్న సినిమాలను హిందీలోకి రీమేక్ చేస్తున్న క్రమంలో మాధురి ఏకంగా మరాఠీలోనే నటిస్తుండటం బాలీవుడ్‌లో చర్చకు తెరలేపింది. అతి త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది ఈ సినిమా. ప్రస్తుతం మాధురి ఈ సినిమా కాకుండా హిందీలో ‘టోటల్ ఢమాల్ – 3’ లో నటిస్తోంది.