mictv telugu

కోటి రూపాయలతో వెంటిలేటర్ కొనిస్తే… మీ బిడ్డను బ్రతికిస్తాం

February 12, 2019

వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి బలైన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్ ఖండ్‌‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్షికా అహిర్వార్‌ అనే చిన్నారిపై ప్రమాదవశాత్తు వేడినీళ్లు పడడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. రోజురోజుకీ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో వెంటిలేటర్‌ ద్వారా చికిత్స అందించాలని తల్లిదండ్రులు కోరారు. దీనికి స్పందించిన అక్కడి డాక్టర్‌ జ్యోతి రావత్‌ ఆసుపత్రిలో వెంటిలేటర్‌ లేదని.. మీ పాపను బతికించాలంటే కోటి రూపాయలతో హాస్పిటల్‌లో దానిని‌ ఏర్పాటు చేయాలని ఆగ్రహంగా ఆదేశించారు.

ఇంతలో ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడి అధికారులు వీడియోను చూసి స్పందించారు. వెంటనే డాక్టర్‌ జ్యోతిని విధుల్లో నుంచి తాత్కాలికంగా తొలగించారు. అయితే దీనిపై హాస్పిటల్ డీన్‌ను వివరణ కోరగా హాస్పిటల్‌లో 17 వెంటిలేటర్లు ఉన్నాయని తెలిపారు. చిన్నారి బంధువు బ్రిజేంద్ర కుమార్‌ మాట్లాడుతూ.. ‘మా పాపకు వైద్యులు సరైన చికిత్స అందించలేదు. ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించాలని సూచించారు. దీంతో మేం అధికారులకు ఫిర్యాదు చేశాం. అనంతరం డా.జ్యోతి రావత్ చికిత్స చేయడానికి వచ్చారు. చిన్నారికి వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించాలని కోరారు. అయితే ఇక్కడ ఆ సదుపాయం లేదు… రూ.కోటితో వెంటిలేటర్‌ను ఏర్పాటు చేస్తే వైద్యం చేస్తాను అన్నారు’ అని వారి మధ్య జరిగిన సంభాషణను వివరించారు.Telugu News Madhya Pradesh Baby Dies As Burns Ward Doesn t Have Ventilator Family Told To Get One