కక్కసును చేతితో క్లీన్ చేసిన ఎంపీ.. - MicTv.in - Telugu News
mictv telugu

కక్కసును చేతితో క్లీన్ చేసిన ఎంపీ..

February 19, 2018

ఎప్పుడైనా మీరు టాయిలెట్ క్లీన్ చేశారా..? చేస్తే అందులో చేయిపెట్టి మరీ శుభ్రంగా కడిగారా..? ఛీ అలా అడుగుతారేంటి చేతులకు గ్లౌవ్స్ వేసుకుని బ్రష్షులతో చేస్తాం కానీ చేయి పెట్టి చేయడం ఏంటి? అని అంటున్నారా? మీరన్నది నిజమే. కానీ ఓ బీజేపీ ఎంపీ మాత్రం చేతులకు గ్లౌవ్స్ లేకుండా, బ్రష్షు పట్టుకోకుండా చేతులతోనే టాయిలెట్ క్లీన్ చేశారు.

మధ్యప్రదేశ్‌లోని రేవా ఎంపీ జనార్ధన్ మిశ్రా తన నియోజకవర్గ పరిధిలోని ఖజుహా గ్రామాన్ని సందర్శించారు. అక్కడి పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల సమస్యలను  అడిగి తెలుసుకున్నారు. తమ టాయిలెట్ బాగోలేదని, దీంతో కాలకృత్యాలు తీర్చుకోవడానికి  బహిర్భూమికి వెళ్తున్నామని చెప్పారు. దాంతో వెంటనే టాయిలెట్ దగ్గరికెళ్లిన ఎంపీ అది నిరూపయోగంగా పడి ఉండటాన్ని గమనించారు. అందులో పేరుకుపోయిన మట్టిని చేయి పెట్టి మరీ క్లీన్ చేశారు. ఇందు కోసం ఆయన చేతికి గ్లౌవ్స్ కూడా తొడుక్కోలేదు. మోదీ వీరాభిమాని అయిన ఎంపీ గారు చేసిన పని అక్కడి విద్యార్థులను ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.