mictv telugu

ఆకలికి తట్టుకోలేక పురుగుల మందు తాగిన బాలుడు

January 7, 2019

దేశంలోని గోడౌన్లలో టన్నులకొద్దీ ధాన్యం పురుగుల పాలవుతోంది. పెదబాబుల పెళ్లిలో తినలేక పారేస్తున్న భోజనం టన్నుల్లో ఉంటోంది. మరోపక్క కడుపుకు పిడికెడు అన్నం లేక ఆకలితో అలమటించి చనిపోతున్నారు. ఓ బాలుడు ఆకలి బాధ తట్టుకోలేక పురుగుల మందు తాగాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రతలామ్ జిల్లాలో గత ఏడాది డిసెంబర్ 31 న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాతీయ బాలల హక్కుల కమిషన్ దీని గురించి వెల్లడించింది.

Telugu News Madhya Pradesh Child Allegedly Drinks Insecticide Due To Hunger, Critical.

పురుగుల మందు తాగింది గిరిజన బాలుడని కమిషన్ అధికారులు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాలుడి గ్రామానికి ప్రత్యేక బృందాన్ని కూడా పంపామన్నాడు. అతని కుటుంబం ఎన్నిసార్లు అభ్యర్ధించినా స్థానిక రేషన్ డీలర్ గోధుమలు ఇవ్వలేదు. దీంతో ఆకలిని తట్టుకోలేక ఆ చిన్నారి పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాబు పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఐసీయూలో ఉంచి బాలుడికి చికిత్స అందిస్తున్నారు.

Telugu News Madhya Pradesh Child Allegedly Drinks Insecticide Due To Hunger, Critical