బీజేపీ అభ్యర్థికి చెప్పుల దండ సత్కారం.. - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ అభ్యర్థికి చెప్పుల దండ సత్కారం..

November 20, 2018

రాజకీయ నాయకులపై ప్రతీకారాన్ని ఎప్పుడెప్పుడు తీర్చుకుందామా అని ఎదురుచూస్తుంటారు ప్రజలు. ఎన్నికల సమయంలో అది చేస్తాం, ఇది చేస్తాం అని హామీలు ఇచ్చి అవి నెరవేర్చుకున్నా.. గెలిచాక నియోజకవర్గాన్నిఅభివృద్ధి చేయకున్నా.. సరైన సదుపాయాలు కల్పించకున్నా.. వారికి ప్రజలు ఇచ్చే బహుమానాలే వేరు. చాలా మంది నేతలు ఎన్నికల తర్వాత ప్రజలకు దర్శన భాగ్యం  కల్పించడం చాలా తక్కువే. పనికోసం వెళ్లినా.. పైసలకోసం వెళ్లినా వారి ముఖదర్శనం దొరకడమే కష్టం. అలాంటి ఒక నాయకుడి చేతిలో ఎన్నికష్టాలు పడ్డాడో ఇతగాడు. ఆ నాయకుడి పరువు అందరూ ముందు తీశాడు.

మధ్యప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దిలీప్ షెకావత్ నగడలో ప్రచారం కోసం వెళ్లాడు. అందరికీ అభివాదం చేస్తూ.. కనిపించిన వారినళ్ల పలకరిస్తూ.. చిరునవ్వు చిందిస్తూ.. ఆశీస్సులు పొందుతున్నాడు.  ఈ సమయంలో ఓ వ్యక్తి ఆయన మెడలో చెప్పుల దండ వేసి స్వాగతం పలికాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే ఆ దండను విసిరేసి, ఆ వ్యక్తిపై దాడికి దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.