వాట్సాప్‌లో పెడతా అన్నందుకు.. ఆత్మహత్య చేసుకుంది..   - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సాప్‌లో పెడతా అన్నందుకు.. ఆత్మహత్య చేసుకుంది..  

November 30, 2017

కొందరు ఇతరుల ఫోటోలను తీసి ఆటపట్టిస్తూ ఉంటారు. సరదాగా చేసే పనులతో అప్పడప్పుడు అనుకోని  ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. భార్యను సరదాగా ఆటపట్టించడానికి ఒక భర్త చేసిన పనికి తీవ్ర విషాదానికి దారితీసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన డాక్టర్ నళిన్ పాట్నీ స్కిన్ స్పెషలిస్ట్ . అతని భార్య సోనా దంతసమస్యతో బాధపడుతుడడంతో ఆమెను ఇటీవల వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆమె పన్ను ముందు భాగం పాడైందని తొలగించి కొత్తది అమర్చాలని డాక్టర్ చెప్పాడు.పన్ను పాడైందని భార్య సోనాను ఆటపట్టించడం మెుదలుపెట్టాడు. డాక్టర్ పన్ను తొలగించిన  తరువాత ఫోటో తీసి  వాటాప్స్‌లో పెడతానని, దానికింద ‘నా భార్య ముసలిదైపోయిందని,పళ్లు ఊడిపోయాయని కామెంట్ కూడా పోస్ట్ చేస్తాను  అని ’ ఆట పట్టించాడు. దీంతో సోనా తీవ్ర  మనస్తాపానికి గురైంది. ముభావంగా తన గదిలోకి వెళ్లి కాసేపటి తరువాత హాల్లకి వచ్చింది.  తాను విషం తాగనని భర్తకు చెప్పింది. అతడు  షాక్‌కు గురైయ్యాడు. వెంటనే ఆసుపత్రికి  తీసుకెళ్లాడు. చికిత్స పోందుతూ సోనా మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.