అమ్మాయిలకు బాయ్‌ఫ్రెండ్ ఎందుకు ? బీజేపీ ఎమ్మెల్యే - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మాయిలకు బాయ్‌ఫ్రెండ్ ఎందుకు ? బీజేపీ ఎమ్మెల్యే

March 26, 2018

బీజేపీ ఎమ్మెల్యే  పన్నాలాల్ శాక్య అమ్మాయిలకు ఓ సలహా ఇచ్చారు. బాయ్ ఫ్రెండ్స్ అమ్మాయిలకు వద్దని, అమ్మాయిలు ,అబ్బాయిలకు దూరంగా ఉంటే అమ్మాయిలకే మంచిదని సూచించారు. ‘ అసలు అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్‌తో పనేంటి?,ఇలాంటివి మానేస్తే వాళ్లపై  అత్యాచారాలు జరగవు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని గునా ప్రభుత్వ కాలేజీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన పన్నాలాల్ మీడియాతో అమ్మాయిలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే అబ్బాయిలను కూడా మందలించారు… ‘ మీతో ఇప్పుడు ఏదైతే చెప్పానో వారికి కూడా అదే చెప్పాను. అమ్మాయిలకే కాదు. అబ్బాయిలకు కూడా చెబుతున్నాను. గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఏర్పరుచుకోవడం  పాశ్చత్య సంస్కృతి. అలాగే మహిళా దినోత్సవం అనేది కూడా విదేశీయులు సంప్రదాయం. భారతీయ సిద్దాంతాల ప్రకారం మహిళను మనం అత్యున్నతంగా గౌరవిస్తాం. ప్రతి ఏడాదికి నాలుగుసార్లు మహిళ దినోత్సవాన్ని జరుపుతాం. నాలుగుసార్లు వారిని ఆరాధిస్తాం’ అని చెప్పుకొచ్చారు.గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలతో ఎమ్మెల్యే శాక్య వార్తల్లో నిలిచారు. గతడాది డిసెంబర్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆయన వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఇండియాలో పుట్టి పెరిగి, ఇక్కడ కీర్తి ప్రతిష్టలు, డబ్బు సంపాదించుకుని ఇటలీలో వివాహం చేసుకోవడమేంటి? అని అప్పట్లో ఆయన ప్రశ్నించారు. విరాట్ కోహ్లీ దేశభక్తుడు కాదని వ్యాఖ్యానించారు.