ధూమపానంపై  చిన్నారి పోరాటం - MicTv.in - Telugu News
mictv telugu

ధూమపానంపై  చిన్నారి పోరాటం

November 23, 2017

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన దిశా(13) ‘దిశా మిషన్ నో స్మోకింగ్’ అనే ఉద్యమాన్ని ప్రారంభించింది. గత 7 సంవత్సరాల నుంచి  ఈ ఉద్యమం ద్వారా  దాదాపుగా 5వేల మంది చేత సిగరేట్ తాగడాన్ని మాన్పించింది. ఈ సందర్బంగా దిశా మాట్లాడుతూ…‘మా తాత చనిపోయినప్పడు నాకు ఐదు  సంవత్సరాలు . తాత నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు.తాత ఎందుకు చనిపోయాడని అమ్మని అడిగితే క్యాన్సర్ వచ్చి చనిపోయాడని చెప్పింది. అప్పటి నుంచి సిగరేట్ కు  వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించి. తాత చనిపోయిన కారణాన్ని  సిగరేట్ తాగేవారికి చెబుతూ, వారిచేత  ఆ అలవాటును మాన్పించే ప్రయత్నం ’ చేస్తున్నాని చెప్పింది.